జిల్లాలో కురసాల కన్నబాబు పర్యటన నేడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్‌గా నియమితులైన కురసాల కన్నబాబు మంగళవారం తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ అధిష్టానం రీజనల్ బాధ్యతలు అప్పగించిన తర్వాత పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే మంగళవారం శ్రీకాకుళం వస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులతో సమావేశం కానున్నారు. జిల్లాలోని పార్టీ అగ్రనేతలను ప్రత్యేకంగా కలిసి పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment