పింఛన్లు ఆపేశారు మహాప్రభో
సంతబొమ్మాళి: సంతబొమ్మాళి పంచాయతీ నగిరిపెంట గ్రామానికి చెందిన పదిమంది తమ పింఛన్లు ఆపేశారంటూ ఎంపీడీఓ జయంతి ప్రసాద్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. అందరికీ ఈ నెల 1వ తేదీన పింఛన్లు ఇచ్చి తమవి ఎందుకు ఆపేశారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన వ్యక్తి తమపై ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత తమ పింఛన్లు హోల్డ్‌లోకి వెళ్లిపోయాయని రకరకాల కారణాలు చెప్పి పింఛన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు పింఛన్లు ఇప్పించాలని లబ్ధిదారులు బి.సుజాత, అరంగి ప్రకాష్, ఎస్.లక్ష్మి, జి.లోకనాధం, అప్పారావు, రాజు తదితరులు కోరారు.
ధాన్యం నిల్వలపై ఆరా
బూర్జ: మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం నిల్వలపై జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆరా తీశారు. ఆయన మంగళవారం గుత్తావల్లి, లాభాం, పాలవలస, లక్కుపురం గ్రామాల్లో పర్యటించారు. కుప్పలతో ఉన్న ధాన్యం, కుప్పలు నూర్చిన తర్వాత కొనుగోలుకి సిద్ధంగా ఉన్న ధాన్యం నిల్వల గురించి అడిగి తెలు సుకున్నారు. మండలంలో గల మిల్లర్లు టార్గెట్ పూర్తయ్యిందని కొనుగోలు చేయడం లేదని రైతులు జేసీకి తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎన్.శ్రీనివాసరావు, సివిల్ సప్లై డీటీ మురళి మోహన్, వీఏఏలు వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.
నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రణాళికలు: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లిన సెక్రటేరియట్ సిబ్బంది సెలవులను సంబంధిత జిల్లా అధికారులు రెగ్యులరైజ్ చేయవద్దన్నారు. సచివాలయ సిబ్బంది హాజరు 90 శాతం కన్నా తగ్గకూడదని పేర్కొన్నారు. పీఎంఏవైకు దరఖాస్తు చేసుకున్న వారు 41,862 మంది ఉన్నట్లు హౌసింగ్ పథక సంచాలకులు నగేష్ తెలియజేశారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఎవరైనా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ఆర్‌ఎస్‌కే వారీగా లిస్ట్ ఇస్తే వారికి ధాన్యం సేకరణకు అనుమతి మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు.
మూడోరోజు
741 మంది గైర్హాజరు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 75 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్ష ల్లో భాగంగా మూడోరోజు ఫస్టియర్ విద్యార్థులు సెట్–1 ప్రశ్నాపత్రంతో ఇంగ్లీషు పేపర్‌కు పరీక్ష రాశారు. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 21,966 మంది హాజరుకావాల్సి ఉండగా 741 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదని అధికారులు ధ్రువీకరించారు.
4
పింఛన్లు ఆపేశారు మహాప్రభో
Comments
Please login to add a commentAdd a comment