ఈ ఓటమి.. అసమర్థ పాలనకు సాక్ష్యం
మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు సరికాదు●
● ఉపాధ్యాయ ఉద్యమాన్ని
అవమానించడం తగదు
● ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందే కూటమి ప్రభుత్వం
● ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై పోరాటమే తమ లక్ష్యమని యూటీఎఫ్ నాయకుల వెల్లడి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర మంత్రి కె.అచ్చెనాయుడు ఉపాధ్యాయ ఉద్యమాన్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, కోశాధికారి బి.రవికుమార్, గౌరవాధ్యక్షులు కె.వైకుంఠరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. యూటీఎఫ్‌కు వైఎస్సార్ సీపీ ముసుగు వేస్తూ మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు చేయడాన్ని యూటీఎఫ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాస్తవానికి ఏపీటీఎఫ్, పీఆర్‌టీయూ అభ్యర్థులకు కూటమి ముసుగు వేయ డం ద్వారా అధికార పక్షమే ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందని వారు విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన పార్టీలు బహిరంగంగా మద్దతు పలికిన అభ్యర్థి ఓటమి చవిచూడటాన్ని చూస్తుంటే.. వారి అసమర్థ పరిపాలనకు, ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్యుల ఆగ్రహానికి నిదర్శనమన్నారు. విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాలకు చెంపపెట్టే కూటమి అభ్యర్థి ఓటమి అనే విషయాన్ని ఇప్పటికై నా అధికార పాలకులు గ్రహించాలని కోరారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ స్వతంత్రంగా పోటీ చేసిందని.. దానికి యూటీ యఫ్, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయని వారు గుర్తుచేశారు. ఏ అధికార, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ యూటీఎఫ్ పనిచేయదని స్పష్టం చేశారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పట్ల తమ పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటామని కిషోర్‌కుమార్, బాబూరావు, శ్రీరామమూర్తి పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే.. కూటమి ప్రభుత్వం ఆలోచనలు, నిర్ణయాలు అత్యంత ప్రమాదకారంగా ఉంటున్నాయని పేర్కొన్నారు.
పీడీఎఫ్ అంటే
సర్కారుకు భయం
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అంటే భయపడుతోందని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పేర్కొన్నా రు. తాజాగా జరిగిన శాసన మండలి ఎన్నికలు దీన్ని రుజువు చేశాయని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఇద్దరేసి అభ్యర్థులను తమవారిగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీడీఎఫ్ సభ్యులు బహిరంగ పోరాటాలు చేయడంతో పాటు మండలిలో ప్రభుత్వాలను నిలదీశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో నైతిక విజయం విజయ గౌరీదే అని పేర్కొన్నారు.
బుచ్చిపేటకు
జ్వరమొచ్చింది..!
నరసన్నపేట: మండలంలోని మడపాం పంచాయతీ బుచ్చిపేట మంచం పట్టింది. గ్రామంలో ప్రతి ఇంటా జ్వర పీడితులు కనిపిస్తున్నారు. జ్వరం తగ్గి కీళ్ల నొప్పులతో ఉన్నవారు కొందరైతే, జ్వరంతో మంచం పట్టిన వారు మరి కొందరు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోందని అంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవా లని కోరుతున్నారు. జ్వరాల గురించి తెలుసుకున్న మాకివలస పీహెచ్‌సీ సిబ్బంది నీటిని పరీక్షలకు పంపినా ఎలాంటి కాలుష్యం కనిపించలే దు. దీంతో సీజనల్ జ్వరాలుగానే భావిస్తున్నారు. అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment