దేశ రక్షణలో సాహషి
●గర్వంగా ఉంది
కఠోర సాధన చేసి మొదటి ప్రయత్నంలోనే ఎస్‌ఎస్‌సీ పరీక్షలో ప్రతిభ కనబర్చి నాలుగేళ్ల క్రితం బీఎస్‌ఎఫ్‌కు ఎంపికయ్యాను. దేశ రక్షణ కోసం సరిహద్దులలో విధులు నిర్వర్తించడం గర్వంగా ఉంది.
– కె.స్రవంతి, సీతాపురం, బీఎస్‌ఎఫ్ జవాన్, వజ్రపుకొత్తూరు మండలం
●సమాజంలో గుర్తింపు
గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన నేను దేశ సైన్యంలో చేరాలన్న కోరికతో ప్రతి రోజు కఠోర సాధన చేశాను. మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో లక్ష్యం సాధించాను. ఇండియన్ నేవికి ఎంపికై ప్రస్తుతం ఒడిశాలో శిక్షణ పొందుతున్నాను.
– బందాపు శ్రీనిధి, ఇండియన్ నేవి, వజ్రపుకొత్తూరు మండలం
వజ్రపుకొత్తూరు రూరల్: తరతరాలుగా కుటుంబ బాధ్యతలకే పరిమితమైన ఆడపడుచులు నేడు దేశ సరిహద్దుల్లో ముష్కరులను మట్టికరిపిస్తున్నారు. బ్రిటీషర్లను తరిమికొట్టిన వీరనారుల వీరత్వాన్ని అందిపుచ్చుకొని సిక్కోలు యువతులు సివంగిలా మారి దేశ రక్షణకు సై అంటున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి సుమారు 350 మంది వరకు యువతులు త్రివిధ దళాల్లో చేరినట్లు సైన్యాధికారులు చెప్తున్నారు.
దేశ రక్షణలో సాహషి
దేశ రక్షణలో సాహషి
దేశ రక్షణలో సాహషి
దేశ రక్షణలో సాహషి
Comments
Please login to add a commentAdd a comment