ఆమేయం.. అజేయం..
మహిళలే రథ సారధులు
నేటి సమాజంలో మహిళలే కుటుంబాలకు రథ సారధులుగా ఉన్నారు. నా విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోనే పూర్తయ్యింది. అనేక సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. చిన్న సమస్యకు కుంగిపోకూడదు, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు దేనినైనా సవాలుగా తీసుకుని ముందుకు సాగాలి. శారీరక ధైర్యం అనేది శారీరక నొప్పిని ఎదుర్కొంటుంది, అయితే నైతిక ధైర్యం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతుంది.
– బి.కరుణశ్రీ, ఈఈ, పొల్యుషన్ కంట్రోల్‌బోర్డు
లక్ష్యం నిర్దేశించుకోండి
ప్రతి బాలిక చదువుకునే సమయంలోనే లక్ష్యం నిర్దేశించుకోవాలి. కష్టపడి ఆ లక్ష్యాన్ని సాధించాలి. మనం పట్టుదలగా ఉంటే కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు.
– కె.సాయి ప్రత్యూష, ఆర్డీఓ, శ్రీకాకుళం
సమానత్వం కీలకం
మహిళలు తమ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. సాధికారత, సమానత్వం రెండూ సాధించాలి.
– ఇ.అనురాధ, డీబీసీ, శ్రీకాకుళం
అన్ని రంగాల్లో ఎదగాలి..
పురుషులతో సమానంగా అన్నింటా ఎదగాలి. అప్పుడే నిజమైన మహిళా దినోత్సవం సాధ్యమవుతుంది. మహిళల సంరక్షణ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. – కె.కవిత, సహాయ సంచాలకులు, వికలాంగుల సంక్షేమ శాఖ, శ్రీకాకుళం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి మచ్చుకై నా కనిపించడం లేదు.
– పిరియా విజయ,
జెడ్పీ చైర్‌పర్సన్,
ఆత్మవిశ్వాసంతో ముందుకు..
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. ఉన్నతమైన ఆలోచనలతో, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి. తల్లిదండ్రులు మహిళలను విద్యలో ప్రోత్సహించాలి. కుటుంబాన్ని, సమాజాన్ని మహిళలు ఆదర్శంగా తీర్చి దిద్దగలరు.
– ప్రొఫెసర్ కేఆర్ రజిని, వైస్ చాన్స్‌లర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ
చదువే మూలధనం
మహిళలు రాణించాలంటే చదువు చాలా ముఖ్యం. చక్కగా చదువుకుంటేనే ఉన్నత శిఖరాలు అధిరోహించగలం. కుటుంబ బాధ్యతలు కూడా మహిళలకు కీలకమే. – ప్రసన్న లక్ష్మి,
జేడీ, సీపీఓ కార్యాలయం,
వివక్ష లేని సమాజం కావాలి..
వివక్ష లేని, వేధింపులు లేని, సమసమాజం వచ్చిన నాడే ఈ కార్యక్రమాలకు, ఈ ఉ త్సవాలకు అర్థం ఉంటుంది. ఆ దిశగా మనమంతా కృషి చేయాలి.
– ఆర్.గడ్డెమ్మ, ఈడీ, బీసీ కార్పొరేషన్
●
ఆమేయం.. అజేయం..
ఆమేయం.. అజేయం..
ఆమేయం.. అజేయం..
ఆమేయం.. అజేయం..
ఆమేయం.. అజేయం..
ఆమేయం.. అజేయం..
ఆమేయం.. అజేయం..
ఆమేయం.. అజేయం..
Comments
Please login to add a commentAdd a comment