
ఉపాధి కోర్సుల్లో మహిళలకు శిక్షణ
శ్రీకాకుళం రూరల్: ఎచ్చెర్లలోని ఎన్టీఆర్ మహిళా ప్రాంగణంలో మహిళలకు ఉపాధి కల్పించే దిశగా నూతన కోర్సులను నిర్వహించనున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బేబికేర్ టేకర్, వేర్‌హౌస్ అసోసియేట్, ఫార్మా స్టోర్ అసోసియేట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, పేషెంట్ రిలేషన్స్ కోర్సులను ఈ నెల 17 నుంచి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదు నుంచి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన 18 నుంచి 45 ఏళ్ల మహిళలు అర్హులని తెలిపారు. 45 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రందించాలని కోరారు.
వేతనాలు పెంచాలని వినతి
ఎచ్చెర్ల క్యాంపస్: ట్రిపుల్ ఐటీలో 2018 నుంచి పని చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీకి వేతనాలు పెంచాలని కోరుతూ సిబ్బంది శనివారం ఎస్‌ఎంపురం ఆర్‌జీయూకేటీ క్యాంపస్‌లో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
టెక్కలి రూరల్ : ధర్మనీలాపురం గ్రామానికి చెందిన గురుబెల్లి కృష్ణారావు(65) శనివారం సాయంత్రం రైలు ఢీకొని మృతి చెందాడు. కృష్ణారావు రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి మృతదేహం మాయమైనట్లు తెలుస్తోంది.
డ్రోన్ టెక్నాలజీపై అవగాహన
ఎచ్చెర్ల క్యాంపస్: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) ఎస్‌ఎంపురం క్యాంపస్‌లో నిర్వహిస్తున్న జాతీయ టెక్నో మేనేజ్‌మెంట్ ఫెస్ట్ (టెక్నివర్స్ 2025) శనివారం కూడా కొనసాగింది. విద్యార్థులు డ్రోన్ టెక్నాలజీ, ప్రాజెక్టు ఎక్స్‌పో వంటివి నిర్వ హించారు. ఐఐటీ గువాహటి నుంచి రీసోర్సు పర్సన్‌గా హాజరైన ప్రొఫెసర్ విజయసారథి మిషన్ లెర్నింగ్ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కన్వీనర్ గేదెల రవి, సహాయ కన్వీనర్ తేజ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ అభ్యర్థులకు
ఉచిత ఆన్‌లైన్ శిక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్ : శ్రీకాకుళం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఇ.అనురాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ అర్హత సాధించి జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ కేటగిరీల అభ్యర్థులు అర్హులని, వివరాలకు శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులోని బీసీ స్టడీ సర్కిల్ వద్ద గా నీ, 7382975679, 9295653489 నంబర్లను గానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
రాష్ట్ర ఇంటెలెక్చువల్ ఫోరం విభాగం నియామకం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ ఫోరం విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పిల్లల రామకృష్ణ, కార్యదర్శిగా సీపాన వెంకటరావు, సంయుక్త కార్యదర్శిగా ఎస్.భీమాచార్యులును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర కమిటీ లో జిల్లా నుంచి వీరికి అవకాశం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment