వైఎస్ జగన్ పాలనలోనే మహిళా సాధికారత
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మహిళలు రాజకీయ, సామాజిక ఎదుగుదలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చినది మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్ సీపీజిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలో జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతి ఆధ్వర్యంలో శనివారం మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి కుటుంబం వద్ద లక్షలాది రూపాయలు ఉండేవని, ప్రతి పథకాన్ని మహిళా ఖాతాల్లో వేసి కుటుంబ అభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికార దాహంతో మహిళలకు లేనిపోని హామీలన్నీ ఇచ్చి ఒక్కటి కూడా అమలుచేయకుండా మోసగించారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ హయాంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, చైర్మన్ పదవులన్నీ 70 శాతం మహిళలకే ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంపై తొమ్మిది నెలల్లోనే మహిళలంతా మండిపడుతున్నారని చెప్పారు. జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయసాయిరాజ్ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు గుర్తించి పదవులిచ్చిన క్రమంలోనే తనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కిందన్నారు. పార్టీలకు అతీతంగా పథకాలు వర్తింపజేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా నేతలు అంబటి నిర్మలా శ్రీనివాస్, మూకళ్ల సుగుణ, కోరాడ ఆశాలత, రాజాపు హైమావతి, చింతు అన్నపూర్ణ, జి.వెంకటరమణి, చల్ల సుగుణా, టి.కామేశ్వరి, గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment