
నదుల పరిరక్షణ అందరి బాధ్యత
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): నదులను కాలుష్యపు కోరల నుంచి పరిరక్షించాలని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కరుణశ్రీ అన్నారు. నగరంలోని ఏడురోడ్ల కూడలి సమీపంలో ఉన్న నాగావళి నదిలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ శ్రీకాకుళం– స్వచ్ఛ నాగావళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణశ్రీ మాట్లాడుతూ నదుల పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నదుల దురాక్రమణ పర్యావరణ వినాశనానికి, నీటి వనరుల క్షీణతకు కారణమవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్మన్ నటుకుల మోహన్, మంత్రి వెంకటస్వామి, ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిలెడ్ (ఏఓఎల్) ఎం.కృష్ణయ్య, అపర్ణ ఫార్మాస్యూటికల్ ప్రైవేటు లిమిటెడ్ సీనియర్ మేనేజర్ శ్యామ్‌బాబు, ఎపిటోరియా ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ లైజినింగ్ ఆఫీసర్ ప్రసాద్, మహాధన్ పరిశ్రమ హెచ్‌ఆర్ రాజేష్, సరాక కంపెనీ ప్రతినిధి ఎ.బ్రహ్మారెడ్డి, రాజశేఖరరెడ్డి, ఎప్టోరియా కంపెనీ జనరల్ మేనేజర్ సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.