అత్యవసరమైతే ఉగ్గపట్టుకోవాల్సిందేనా!
కోదాడ: స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మరుగుదొడ్లకు తాళాలు వేశారు. నాలుగు చోట్ల ఉన్న మరుగుదొడ్లు మూత పడడంతో పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు గానీ పాలకులు గానీ పట్టించుకోవడంలేదు.
స్వయం సహాయక సంఘాలకు
బిల్లులు చెల్లించక..
కోదాడ పట్టణంలో 80వేల జనాభా ఉండగా వివిధ పనుల నిమిత్త ఇక్కడికి రోజూ మరో 20వేల నుంచి 30వేల మంది వచ్చిపోతుంటారు. పట్టణ జనాభాకు అనుగుణంగా 25 పబ్లిక్‌టాయిలెట్లు ఉండాలి. కానీ 10 మాత్రమే ఉన్నాయి. వీటిలో రెండు సులభ్‌కాంప్లెక్స్‌లు ఉన్నాయి. మిగిలిన ఎనిమిదింటిలో ఖమ్మం క్రాస్ రోడ్డు, తహసీల్దార్ కార్యాలయం, గాంధీ పార్కు, కోదాడ ఆర్టీసీ బస్టాండ్‌లలో ఉన్నవాటికి తాళాలు వేశారు. ఆర్టీసీ బస్టాండ్‌లో మినహా మిగతా మూడింటికి సంబంధించి మరుగుదొడ్లు నిర్వహించే స్వయం సహాయక సంఘాలకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఏడాదికి 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే కోదాడ మున్సిపాలిటీ మరుగుదొడ్ల నిర్వహణ బిల్లులు చెల్లించకపోవడంపై విమర్శలువెల్లువెత్తుతున్నాయి. మరుగుదొడ్లు మూత పడడంతో మల, మూత్ర విసర్జనకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, పాత పోస్టాఫీస్ వద్ద ఉన్న మరుగుదొడ్లు మాత్రమే పని చేస్తున్నాయి. ఖమ్మం క్రాస్ రోడ్డు నుంచి సూర్యాపేట రోడ్డు వరకు దాదాపు మూడు కిలోమీటర్ల ప్రధాన రహదారి వెంట మున్సిపాలిటీకి చెందిన ఒక్క మరుగుదొడ్డి కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాల వద్ద, హుజూర్‌నగర్ రోడ్డులోని మార్కెట్ వద్ద ఉన్న సులభ్‌కాంప్లెక్స్‌లు పనిచేస్తున్నాయి.
ఇవీ.. కోదాడ బస్టాండ్ ఆవరణలో మున్సిపాలిటీ అధికారులు రూ. 20 లక్షలు ఖర్చు చేసి మరుగు దొడ్లు నిర్మించారు. వీటిని గత సంవత్సరమే ప్రారంభించారు. ఏమైందో ఏమోగానీ వీటికి తాళం వేశారు. ఇదేమిటని అడిగితే ఈ మరుగుదొడ్లను ఆర్టీసీ అధికారులు తామే నిర్వహిస్తామని స్వాధీనం చేసుకున్నారని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ అధికారులు మాత్రం మున్సిపాలిటీ వారు వచ్చి తమ స్థలంలో కట్టారు కాబట్టి అవి తమవే. వీటి నిర్వహణకు తాము టెండర్లు పిలుస్తాం. వాటి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో నెలల తరబడి వీటికి తాళం వేసి ఉంచుతున్నారు.
ఫ కోదాడ పట్టణంలో నాలుగు ప్రాంతాల్లో మరుగుదొడ్లకు తాళం
ఫ నిర్వహణ ఖర్చులు చెల్లించకపోవడంతో మూడింటి మూసివేత
ఫ ఆర్టీసీ స్థలంలో నిర్మించారని మరొకటి..!
ఫ ప్రజలకు తప్పని ఇబ్బందులు
పనిచేసేలా చూస్తాం
కోదాడ పట్టణంలో మూతబడిన మరుగుదొడ్లు త్వరలో పనిచేసేలా చూస్తాం. ఆర్టీసీ బస్టాండ్‌లోని మరుగుదొడ్ల విషయమై కమిషనర్ వెళ్లి అధికారులతో మాట్లాడారు. త్వరలో సమస్యపరిష్కారం అవుతుంది.
– భవాని, పర్యావరణ ఇంజనీర్,
కోదాడ మున్సిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment