మంత్రి కాన్వాయ్‌లో ఢీకొన్న నాయకుల కార్లు
గరిడేపల్లి: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం హుజూర్‌నగర్ నుంచి జాన్‌పహాడ్ ఉర్సుకు వెళ్తుండగా గరిడేపల్లి వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. గరిడేపల్లి వద్ద రోడ్డుపక్కన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కనబడడంతో మంత్రి కారు ఆపారు. అయితే, కాన్వాయ్‌లో వస్తున్న పలువురు కాంగ్రెస్ నాయకుల కార్లు సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికి ఒకటి మొత్తం ఆరు కార్లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కార్ల దెబ్బతిన్నాయి. మంత్రి కాన్వాయ్‌లోని అధికార వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటనతో కొద్దిసేపు మిర్యాలగూడ–కోదాడ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక నాయకులతో మాట్లాడిన తర్వాత మంత్రి ఉత్తమ్ అక్కడి నుంచి జాన్‌పహాడ్ వెళ్లిపోయారు. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment