సేలం: సేలం జైలులో చైన్నె ఖైదీల నుంచి రెండు సెల్ఫోన్లను జైలు వార్డెన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు ఖైదీలకు మూడు నెలల పాటు బంధువుల విజిటింగ్ను రద్దు చేశారు. వివరాలు..సేలం సెంట్రల్ జైలులో 1200 మంది ఖైదీలు ఉన్నారు. సేలం జైలులో 17వ బ్లాక్ ప్రాంతంలో చైన్నెకి చెందిన ఖైదీలు ఉన్నారు. ఆ గది వైపు వార్డెన్లు వెళితే, అప్పుడప్పుడు వచ్చి తమను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఖైదీలు వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. దీంతో వారి వద్ద ఏదైనా వస్తువు అక్రమంగా ఉండవచ్చనే సందేహంతో వార్డెన్లు భావించారు. ఆ మేరకు పథకం వేసి ప్రతి మంగళవారం ఖైదీల అవసరాలను తెలుసుకునే కార్యక్రమం జరపుతున్నట్టు తెలిపి మంగళవారం అకస్మాత్తుగా చైన్నె ఖైదీలు ఉన్న గదికి వెళ్లారు. అక్కడ గదిలో చుట్టు పక్కల గోడలను పరిశీలించారు. అక్కడ గదికి ఎదురుగా ఉన్న రాగి చెట్టు పై ఉన్న రెండు సెల్ఫోన్లను, మరుగుదొడ్డిలో ఉన్న సెల్‌ఫోన్ ఛార్జర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థితిలో సెల్ఫోన్లను అక్రమంగా ఉపయోగించినట్టు చైన్నె వడపళనికి చెందిన యుగేంద్రన్ (26), అరుంబాక్కం సెబాస్టియన్ జయప్రకాశ్ (27), మహాలింగ్ (39) అనే ముగ్గురు ఖైదీలకు మూడు నెలల పాటు బంధువులను కలుసుకోవడానికి నిషేధం విధించారు.
Comments
Please login to add a commentAdd a comment