ఘనంగా 25వ వార్షికోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ రంగంలో ‘ఏడీపీ ఇండియా’ వినూత్న ఆవిష్కరణలతో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ అగ్రస్థానంలో కొనసాగుతోందని ఏడీపీ గ్లోబల్ ప్రెసిడెంట్, సీఈఓ మరియా బ్లాక్ తెలిపారు. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్, సరీ్వసెస్‌లో ప్రసిద్ధి చెందిన ఏడీపీ ఇండియా 25వ వార్షికోత్సవాలను ఆదివారం నిర్వహించింది. నగరంలోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ శ్రీని కుటం, సీఎఫ్‌ఓ డాన్ మెక్‌గ్యురే, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ పాల్ బోలాండ్‌తో పాటు దాదాపు 5 వేల మంది ఏడీపీ అసోసియేట్లు పాల్గొన్నారు.
102 మంది అసోసియేట్‌లతో కార్యకలాపాలను ప్రారంభించి 25 ఏళ్లలో 12 వేల మందికి పెరగడం విశేషమని మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ వేములపల్లి అన్నారు. 25 శాతం సరీ్వస్ ఆర్గనైజేషన్, 34 శాతం సాంకేతిక బృందాలు ఉన్నాయని, ప్రపంచ మార్కెట్‌లో కంపెనీ శక్తివంతమైన పనితీరుకు ఇది నిదర్శనమన్నారు. నూతన ఆవిష్కరణలతో క్లైంట్ సేవలను అందించే కేంద్రంగా సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తుందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుజ్ఞాన్ వెంకటేష్ అన్నారు. ఏడీపీ ఇండియా సీఎస్‌ఆర్ ప్రోగ్రాం–తరంగ్, స్టూడియో, డ్యాన్సింగ్ స్టార్స్, ధోల్ అసోసియేట్‌ల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment