HYD: తండ్రితో బైక్‌పై వెళ్తుండగా.. చైనా మాంజా కోసుకుపోయి.. | China Manja Hit Father And Daughter Injured In Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: తండ్రితో బైక్‌పై వెళ్తుండగా.. చైనా మాంజా కోసుకుపోయి..

Published Sat, Jan 14 2023 12:38 PM | Last Updated on Sat, Jan 14 2023 12:39 PM

China Manja Hit Father And Daughter Injured In Hyderabad - Sakshi

చైతన్యపురి/మన్సూరాబాద్‌: తండ్రితో బైక్‌పై వెళుతున్న బాలిక మెడకు పతంగి మాంజా తగలడంతో తీవ్రంగా గాయపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ మదుసూధన్‌ తెలిపిన మేరకు.. వనస్థలిపురం కమలానగర్‌ కాలనీలో నివాసముంటున్న వినయ్‌కుమార్, స్నేహలత దంపతులు నివాసముంటున్నారు. వీరి కూతురు కీర్తి (6) ఫస్ట్‌ క్లాస్‌ చదువుతుంది. 

శుక్రవారం సాయంత్రం  వినయ్‌కుమార్‌ కూతురు కీర్తిని తీసుకుని బైక్‌పై నాగోలు మెట్రో స్టేషన్‌కు వెళుతున్నాడు. నాగోలు ఫ్లై ఓవర్‌ప పై నుంచి ఉప్పల్‌ వైపు వెళుతుండగా గాలిపటం మాంజా కీర్తికి మెడకు, విన్‌కుమార్‌ ముక్కుకు తగిలింది. దీంతో బైక్‌పై నుంచి ఇద్దరూ కిందపడి గాయపడ్డారు.  స్థానికులు సమీపంలోని సుప్రజ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి చింతల్‌కుంట రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు.  చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌ మదుసూధన్‌ ఆసుపత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినయ్‌కుమార్‌ ఇచి్చన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement