kites flying
-
HYD: తండ్రితో బైక్‌పై వెళ్తుండగా.. చైనా మాంజా కోసుకుపోయి..
చైతన్యపురి/మన్సూరాబాద్: తండ్రితో బైక్‌పై వెళుతున్న బాలిక మెడకు పతంగి మాంజా తగలడంతో తీవ్రంగా గాయపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మదుసూధన్ తెలిపిన మేరకు.. వనస్థలిపురం కమలానగర్ కాలనీలో నివాసముంటున్న వినయ్‌కుమార్, స్నేహలత దంపతులు నివాసముంటున్నారు. వీరి కూతురు కీర్తి (6) ఫస్ట్ క్లాస్ చదువుతుంది. శుక్రవారం సాయంత్రం వినయ్‌కుమార్ కూతురు కీర్తిని తీసుకుని బైక్‌పై నాగోలు మెట్రో స్టేషన్‌కు వెళుతున్నాడు. నాగోలు ఫ్లై ఓవర్‌ప పై నుంచి ఉప్పల్ వైపు వెళుతుండగా గాలిపటం మాంజా కీర్తికి మెడకు, విన్‌కుమార్ ముక్కుకు తగిలింది. దీంతో బైక్‌పై నుంచి ఇద్దరూ కిందపడి గాయపడ్డారు. స్థానికులు సమీపంలోని సుప్రజ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి చింతల్‌కుంట రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. చైతన్యపురి ఇన్స్పెక్టర్ మదుసూధన్ ఆసుపత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినయ్‌కుమార్ ఇచి్చన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
గాలి పటం ఎగురవేస్తుండగా జారి పడి..
-
గాలిపటం ఎగురవేస్తుండగా..
సాక్షి, నందిగామ: సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణాజిల్లా నందిగామలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలో గాలిపటాలు ఎగరవేస్తుండగా భవనంపైనుంచి జారిపడి ఓ బాలుడు మృతిచెందాడు. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన నితీష్ కుమార్(15) గాలిపటం ఎగురవేస్తుండగా అపార్టుమెంట్‌పై నుంచి జారి కిందపడి మృతిచెందాడు. మృతుడు నందిగామలోని ఓ ప్రెవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. -
గాలిపటాలు ఎగిరేస్తూ..
హైదరాబాద్: దసరా సెలవుల్లో సరదాగా గాలిపటాలు ఎగరేస్తున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురయ్యారు. ఇంటి పైన డాబాపై గాలిపటాలు ఎగరేస్తున్న ఇద్దరు చిన్నారులు.. గాలిపటం విద్యుత్ వైర్లలో చిక్కుకోవడంతో దాన్ని తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కరెంట్‌షాక్‌కు గురయ్యారు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నగరంలోని జగద్గిరిగుట్టలో శనివారం చోటు చేసుకుంది.