సాక్షి,హైదరాబాద్: దుర్మార్గులు చెరువులను ఆక్రమించడం వల్లే వరదలు వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చెరువులు, నాలాలు కబ్జా చేసిన వాళ్లు స్వచ్ఛంధంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేదంటే తమ హైడ్రా వాటిని మొత్తం నేలమట్టం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఆక్రమణదారులు ఎంత పెద్దవాళ్లైనా వదిలేది లేదని హెచ్చరించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం(సెప్టెంబర్11) జరిగిన ఎస్సైల పాసింగ్‌అవుట్ పరేడ్‌లో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసే స్కీమ్ ఏమీ లేదు. ఫాంహౌసుల్లోని డ్రైనేజీ నీటిని ఉస్మాన్‌సాగర్,హిమాయత్‌సాగర్‌లలో కలుపుతున్నారు’అని చెప్పారు.
‘పోలీసు జాబ్ అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు. అది ఒక భావోద్వేగం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులదే కీలక బాధ్యత. మా ప్రభుత్వం 30 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చింది. మరో 35వేలకుపైగా ఉద్యోగాలు ఈ ఏడాది చివరికల్లా ఇస్తాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలపై ఎవరికీ అనుమానాలు లేవు. కేవలం 8 నెలల్లోనే రైతు రుణమాఫీ చేశాం. దుర్మార్గులు చెరువులను ఆక్రమించడం వల్లే వరదలు వస్తున్నాయి. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. కొందరు వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు’అని సీఎం అన్నారు.
ఇదీ చదవండి.. ఫ్యూచర్‌సిటీపై ఆచితూచి
Comments
Please login to add a commentAdd a comment