సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ఏటూరునాగారం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం ఓ మోస్తరునుంచి భారీ స్థాయిలో వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అయితే, అశ్వారావుపేట, దమ్మపేట, అన్న పురెడ్డిపల్లి, జూలూరుపాడు, పాల్వంచ, సుజాతనగర్, సత్తుపల్లి, ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు తది తర మండలాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదైంది. దీంతో జలాశయాల్లోకి నీరు చేరి జలకళ సంతరించుకుంది.
ఇక లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడగా, పలుచోట్ల లోలెవల్ వంతెనల పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏ ర్పడింది. కాగా, ఎగువన వదిలిన నీటితో భద్రాచలంలో ని గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురు వారం రాత్రికి 15 అడుగులకు నీటిమట్టం చేరి స్నానఘ ట్టాలను తాకుతూ ప్రవహిస్తోంది. అయితే, ఇంకా వరద వస్తుండటంతో మరో రెండు అడుగులు పెరగొచ్చని అధి కారులు అంచనా వస్తున్నారు. ఈమేరకు నీటిమట్టం పెరి గితే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు 12 చోట్ల పునరావాస కేంద్రాలను సైతం సిద్ధం చేశారు.
కాగా, భద్రాచలం వద్ద గోదావరి గత ఏడాది ఇదే సమ యానికి 71.3 అడుగులకు చేరిన విషయం విదితమే. ఇక భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజె క్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా వరద వచ్చి చేరు తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, 71. 80 మీటర్ల వద్ద క్రమబద్ధీకరించేందుకు గేట్లు ఎత్తి 2,196 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఉగ్రగోదావరి....: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట గోదావరి బ్రిడ్జి వద్ద గోదావరి నది సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లోని బ్యారేజీల నుంచి నీరు విడుదల కావడం, వరద నీరు బ్రిడ్జి వద్ద ప్రవహిస్తుండటంతో ఇన్ని రోజులు వెలవెలబోయిన గోదావరి నిండుకుండలా మారింది. దీంతో పలువురు పర్యాటకులు సెల్‌ఫోన్‌లో వరద అందాలను బంధించారు.
Comments
Please login to add a commentAdd a comment