సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బస్తీలోని ఓ భవనాన్ని కూల్చేందుకు వచ్చిన జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై స్థానికులు తిరగబడ్డారు. సిబ్బందిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. వారికి అడ్డుకోవడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. తమను అక్రమంగా ఖాళీ చేయిస్తన్నారని నలుగురు వ్యక్తులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కోమోహన్ రెడ్డి కారణంగానే ఇదంతా జరుగుతోందనంటూ ఆరోపించారు. అతని ఇంటి వద్దకు బస్తీవాసులు చేరుకుని బీభత్సం సృష్టించారు. ఇంటి ఆవరణలోని పూలకుండీలను ద్వంసం చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment