నకిలీ స్థిరాస్తి పత్రాలతో నమ్మించి రూ.3.06 కోట్లు వసూలు
సైబరాబాద్ పోలీసులకు చిక్కిన ఇందిరాదేవిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: అధిక లాభాల పేరిట ఓ వ్యక్తికి ఆశపెట్టింది ఓ కి‘లేడీ’. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. లాభాల సంగతేమోకానీ అసలు సొమ్ము అయినా తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరించింది. ఎట్టకేలకు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్(ఈఓడబ్ల్యూ) పోలీసులకు చిక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లికి చెందిన పానుగంటి ఇందిరాదేవిరెడ్డి అలియాస్ ఇందిరాలా ఇందిరాదేవిరెడ్డి నాగోల్‌లో దేవిఫుడ్స్, బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో మదీనాగూడకు చెందిన ఎస్.సత్యనారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. తాను ప్రవాసరాలినని, తనకు నాగోల్, మాదాపూర్, గచి్చ»ౌలి, నార్సింగి ప్రాంతాలలోని గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహాలు ఉన్నాయని నమ్మించింది. నకిలీ యాజమాన్యపత్రాలను కూడా సృష్టించి చూపించింది. ఫుడ్ ఇండస్ట్రీ, బ్యూటీ పార్లర్‌లో పెట్టుబడి పెడితే అధికలాభాలు వస్తాయని ఆశపెట్టి సత్యనారాయణ నుంచి రూ.3.06 కోట్లు వసూలు చేసింది. బాధితుడి వద్ద నుంచి రెండు కార్లను తీసుకొని తనఖా పెట్టింది.
సూడో పోలీసులతో బెదిరింపులు..
అయితే ఆమె ఎంతకీ లాభాలు ఇవ్వడంలేదు. దీంతో లాభాలు కాదు కదా అసలు సొమ్ము అయినా వెనక్కి ఇవ్వాలని నిలదీయగా తన ఇద్దరు స్నేహితులు పోలీసు అధికారులని పరిచయం చేసింది. వారితో కలిసి తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించి భయబ్రాంతులకు గురిచేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇందిరాదేవిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమె నుంచి రెండు కార్లు, ఐ–ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఈమె గతంలో మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడింది. ఈ కేసులో బాధితుడి నుంచి రూ.కోటి వసూలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment