బీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర | KCR Announce Vaddiraju ravichandra As BRS Rajya Sabha Candidate | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర

Published Wed, Feb 14 2024 9:06 PM | Last Updated on Wed, Feb 14 2024 9:16 PM

KCR Announce Vaddiraju ravichandra As BRS Rajya Sabha Candidate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను పార్టీ అధినేత కేసీఆర్‌ప్రకటించారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15 వరకు గడువు ఉండటంతో వద్దిరాజు గురువారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాగా వద్దిరాజుకు వరుసగా రెండోసారి రాజ్యసభ అవకాశం కల్పించారు. మొదటి దఫాలో రవిచంద్ర రెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

తెలంగాణ శాసనసభలో ఆ పార్టీకి ఉన్న బలం ప్రకారం ఒక రాజ్యసభ సీటు దక్కనుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడంతో తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement