
హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే నల్లగొండ నాగార్జున సాగర్‌కు చెందిన బీఆర్‌ఎస్ నేత మన్నెం రంజిత్ యాదవ్ కేటీఆర్ పట్ల తన అభిమానాన్ని మరోలా చాటుకున్నారు.
గగనతలంలో కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మన్నెం రంజిత్ యాదవ్. ఇంగ్లండ్ నాటింగ్‌హమ్‌లో ఓ ఛాపర్‌కు కేటీఆర్ పుట్టినరోజు ఫ్లెక్సీని వేలాడదీసి ఆకాశంలో ప్రదర్శిస్తూ వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment