
పైప్‌లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గాందీ, కార్పొరేటర్లు
ఆల్విన్కాలనీ: ఆల్విన్కాలనీ డివిజన్ సాయినగర్ ఈస్ట్, ఖాజా నగర్‌లలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఆధ్వర్యంలో చేపట్టిన నూతన మురుగునీటి పైప్‌లైన్ పనులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాందీ, ఆల్విన్‌కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు, శ్రీనివాస్ గౌడ్, జీఎం ప్రభాకర్‌రావు, డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్లు ప్రియాంక, ఝాన్సీ, వర్క్ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, నాయకులు సమ్మారెడ్డి, జిల్లా గణేశ్, రాజేష్ చంద్ర, కాశీనాథ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment