హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. విపక్ష నేతలనే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయంటూ మండిపడ్డారు. బీజేపీ వాళ్లు చెప్పినట్లు అరెస్ట్‌లు చేస్తే ఏజేన్సీలు ఎందుకని ప్రశ్నించారు. వైఫల్యాలను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలతో భయపెట్టడం బీజేపీకి అలవాటుగా మారిపోయిందని విమర్శించారు.
‘ఈనెల8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. బీజేపీ 2014, 2019 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇంకో రెండు సెషన్స్ ఉన్నాయి కాబట్టి వీటి ప్రస్తావన తీసుకురావాలి. మహిళా రిజర్వేషన్‌పై భారత జాగృతి ఆధ్వర్యంలో మార్చి 18న ఢిల్లీలో ధర్మా చేయబోతున్నాం. దీనికి దేశంలో ఉన్న రాజకీయ మహిళలు హాజరవుతారు. బీజేపీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. బీజేపీ వచ్చినప్పట్నుంచి జనాభా గణన చేపట్టలేదు’అని కవిత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment