సాక్షి, హైదరాబాద్: రైళ్లు ఆటంకం లేకుండా, సురక్షితంగా గమ్యం చేరేలా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో లెవల్ క్రాసింగ్స్‌ను తొలగిస్తున్నామని జోన్ జనరల్ మేనేజర్ (జీఎం) గజానన్ మాల్యా తెలిపారు. ఏడాదిలోగా వందకుపైగా క్రాసింగ్స్‌ను తొలగించి.. ఓవర్, అండర్ బ్రిడ్జీలను నిర్మిస్తామని వెల్లడించారు. మంగళవారం ఆయన రైల్వే డివిజన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రైళ్లు పూర్తిస్థాయిలో నడపనున్నందున ప్రయాణికుల భద్రత కోసం అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ నుంచి తొలి కిసాన్ రైలు
తెలంగాణ నుంచి తొలి కిసాన్ రైలు మంగళవారం 284 టన్నుల ఉల్లిపాయల లోడుతో 12 పార్శిల్ వ్యాన్లతో కాచిగూడ స్టేషన్ నుంచి అగర్తలాకు బయలుదేరింది. రైల్వేకు రూ.18.30లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment