
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేటకు చెందిన యువకుడు మలేషియాలో మృతిచెందాడు. పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశి వర్ధన్ రెడ్డి(20) మలేషియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఓ ప్రైవేటు షిప్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతను సోమవారం మృత్యువాత పడ్డాడు.
ఉదయం షిప్‌పై నుంచి సముద్రంలో పడిపోవడంతో అతను మృతి చెందినట్లు మలేషియా అధికారులు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారం క్రితమే తమ బిడ్డ ఫోన్ చేశాడని, ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి ఉందని అన్నాడు. త్వరలోనే మరో కంపెనీకి మారాలనుకుంటున్నట్లు చెప్పాడని, ఇంతలోనే ఇలా జరిగిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కాగా, కుమారుడి మృతిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment