
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ఐదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోంమంత్రి ప్రతిభా పురస్కారాలు లభించాయి. 2021వ సంవత్సరానికిగానూ నేర పరిశోధనలో అత్యంత ప్రతిభావంతులకు ఏటా ఇచ్చే కేంద్ర హోంమంత్రి ప్రతిభా పురస్కారాలను గురువారం హోంశాఖ ప్రకటించింది. అధికారులను ప్రోత్సహించడానికి 2018 నుంచి ఈ పురస్కారాలు అందిస్తున్నారు.
అవార్డులు లభించిన వారిలో 15 మంది సీబీఐకి చెందినవారు కాగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి 11 మంది చొప్పున, ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్తాన్ నుంచి 9 మంది చొప్పున, తమిళనాడు నుంచి 8 మంది, బిహార్ నుంచి ఏడుగురు, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ పోలీసు శాఖల నుంచి ఆరుగురు చొప్పున, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు ఉన్నారు. పురస్కారాలు లభించినవారిలో 28 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 152 మంది అధికారులకు ఈ పురస్కారాలు లభించాయి. తెలంగాణ నుంచి ఎంపికైన అధికారులు నాయిని భుజంగరావు(ఏసీపీ), ఎలిగేటి మధుసూదన్ (డీఎస్పీ), ఎన్.శ్యామ్ ప్రసాదరావు (ఏసీపీ), జి.శ్యామ్‌సుందర్ (ఏసీపీ), నేనావత్ నగేశ్(ఎస్‌ఐ)