సాక్షి, హైదరాబాద్: మరో రెండు గ్యారెంటీల అమలుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. గృహలక్ష్మీ, రూ.500కే సిలిండర్ పథకాలను ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. మార్చి నెల నుంచి 200 యూనిట్లు లోపు కరెంట్ వాడే వారికి జీరో బిల్లు వేయాలని ఆదేశించారు.
గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అర్హుల ఖాతాలో వేయాలా లేక ఏజెన్సీకి ఇవ్వాలా అనేదానిపై అధికారులు ఈజీ ప్రాసెస్ చేయాలని సూచించారు. సబ్సిడీ నిధులు వెంట వెంటనే చెల్లించే విధానం ఏర్పాట్లు చేయాలన్నారు. రేషన్ కార్డు, లేక ఇతర కారణాల వల్ల పథకాలకు దరఖాస్తు చేసుకోని వారికి మళ్లీ అవకాశం ఇస్తామని సీఎం పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో రేవంత్ కొత్త పోకడలు!
Comments
Please login to add a commentAdd a comment