
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్)పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేసిన షిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనధికారిక లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఇటీవల ప్రభుత్వం ఈ ఎల్‌ఆర్‌ఎస్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న ఎల్‌ఆర్‌ఎస్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోమటి రెడ్డి అత్యున్నత హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఎంపీ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించగా..ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. (ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో వసూళ్లు! )
రెగ్యులరైజేషన్ జివోలోని రూల్ 10,13ను సవాల్ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. నిబంధ 10 ద్వారా పెనాల్టీ వసూళ్లు చేస్తున్నారు, ఇలా వసూళ్ళ చేసే పెనాల్టీలను ఉపసంహరణ చెయ్యాల్సి ఉంటుంది. నిబంధన 13 ద్వారా రిజిస్ట్రేషన్ ఆపివేయడం. దానిని కొట్టివేయాల్సి ఉంటుంది. ఈ రెండు నిబంధనలపైన హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. (‘అశ్రు నయనాలతో బాలుకి నివాళులు’)
Comments
Please login to add a commentAdd a comment