
సనత్‌నగర్: పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు.. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి తంగెళ్ల కేతన్‌రాజు రచన మీద ఆసక్తితో ‘ఎవిల్ నెవర్ విన్స్’ అనే పుస్తకాన్ని రాసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. సుధామూర్తి రచనలను స్ఫూర్తిగా తీసుకున్న కేతన్‌రాజు తన మదిలో భావాలను పుస్తక రూపంలో ఆవిష్కరించారు.
తల్లిదండ్రులు మల్లీశ్వరి, వెంకట నరసింహరాజుల ప్రోత్సాహంతోనే తాను ఈ పుస్తకం రాశానని కేతన్‌రాజు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను నాగార్జున ఐఐటీ ఒలంపియాడ్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నానని, తాను రాసిన పుస్తకం ‘బ్రి బుక్స్’ అనే పోర్టల్‌లో అందుబాటులో ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరెన్నో రచనలు చేస్తానన్నారు.