
పోస్టర్ ఆవిష్కరిస్తున్న సీఈఓ సరిత
వెంకటగిరిరూరల్ : నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో ఖాతాదారులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు సీఈఓ సరిత తెలిపారు. బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సున్నా నగదుతో బ్యాంకులో ఖాతాలు ప్రారంభించినా రూ. 2లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకు సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మీ భవిష్యత్‌కు మా సహకారం పేరిట పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏజీఎం చంద్రశేఖర్, చీఫ్ మేనేజర్ రాజా తిరుమల దేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment