
కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఆలయ చైర్మన్
తిరుపతి కల్చరల్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహించనున్న గ్రీవెన్స్‌డేని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత తెలిపారు. గురువారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కోటేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన ఆదేశాల మేరకు 22వ తేదీ శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్‌డేను నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఎస్‌ఐ పోస్టుకు ఎంపికై న కానిస్టేబుల్
పెళ్లకూరు: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పీ.సుధీర్‌రెడ్డి గురువారం వెలువడిన ఎస్‌ఐ పరీక్షా ఫలితాల్లో ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యారు. అనంతపురం జిల్లా, పెద్దవడుగూరు మండలం, తెలుగి గ్రామానికి చెందిన గాలి మద్దిలేటిరెడ్డి, సావి త్రమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో చిన్న కుమారుడు సుధీర్‌రెడ్డి పెళ్లకూరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సుధీర్‌రెడ్డి పెద్దన్న లక్ష్మీరెడ్డి గుత్తి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్నతనం నుంచి ఎస్‌ఐ కావాలనే లక్ష్యంతో సుధీర్‌రెడ్డి చదువు కొనసాగించాడు. 2019 డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతుండగా ఎస్‌ఐ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. డిగ్రీ చదువుకుంటూనే 2020లో గ్రౌండ్ టెస్ట్‌లో ఎంపికయ్యాడు. 2023 అక్టోబర్‌లో జరిగిన ఎస్‌ఐ రాత పరీక్ష ఫలితాలు ఈ నెల 21వ తేదీన విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో సుధీర్‌రెడ్డి రాయలసీమ జోన్‌లో 8వ ర్యాంక్ సాధించి, ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్, స్టేషన్ సిబ్బంది సుధీర్‌రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
వైకుంఠ ఏకాదశి వేడుకల కరపత్రాల ఆవిష్కరణ
తిరుపతి కల్చరల్: రేణిగుంట రోడ్డులోని శెట్టిపల్లి వద్దనున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 23వ తేదీ జరుగనున్న వైకుంఠ ఏకాదశి వేడుకల కరపత్రాలను ఆలయ చైర్మన్ భీమాస్ అశోక్, రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్‌రెడ్డి, భాగవతులు రామనాథం గురువారం ఓ ప్రైవేటు హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి నాడు స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణతో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే రోజు ఆలయం వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంగీత కచేరీ, హరికథా గానం, ఎస్వీ మ్యూజిక్ కళాశాల వారి భక్తి సంకీర్తనల విభావరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని స్వామి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

ఎస్‌ఐ పోస్టుకు ఎంపికై న సుధీర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment