కనికట్టు కథలొద్దు! | Sakshi
Sakshi News home page

కనికట్టు కథలొద్దు!

Published Sat, May 4 2024 4:30 AM

కనికట

● పచ్చపత్రిక.. పచ్చి అబద్ధాలు ● జిల్లాలో 571 కొత్త కాలనీల ఏర్పాటు ● 72,436 మందికి జగనన్న ఇళ్లు ● అందులో 28,528 ఇండ్లు పూర్తి ● వివిధ దశల్లో 43,908 ఇండ్లు

తిరుపతి అర్బన్‌: నిరుపేదలకు నీడ కల్పించాలని, ప్రతి పేదోడికి సొంతింటి కల నెరవేర్చాలనే జగన్‌ సర్కారు పరితపించింది. అర్హతే ప్రామాణికంగా ప్రతి పేదవాడికి ఇంటి స్థలం మంజూరు చేసింది. దాంతోపాటు ఇంటి నిర్మాణ బాధ్యతలనూ భుజాన వేసుకుంది. జిల్లాలో 571 కొత్త కాలనీలు ఏర్పాటు చేసింది. మొత్తం 72,436 మందికి ఇంటి పట్టాలు ఇవ్వగా.. అందులో ఇప్పటికే 28,528 ఇళ్లు పూర్తి చేసింది. మరో 43,908 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అయితే దీన్ని జీర్ణించుకోలేని పచ్చపత్రిక కట్టుకథలు అల్లి తప్పడు కథనాలు ప్రచురించింది. 99.5 శాతం మందికి మంచి చేసినా.. ఎక్కడో సాంకేతిక కారణాలతో 0.5 శాతం తప్పిదాలను గుర్తించి వారి ఫొటోలతో అబద్ధపు ప్రచారానికి ఒడిగట్టింది. ‘ఇళ్లు కాదు.. అబద్ధాలు కళ్లకు కట్టారు’ అంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. దీనిపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వం పార్టీలు, కులాలలు, మతాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందరికీ ఇళ్లు మంజూరు చేసిందని, ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. శ్రీకాళహస్తి మండలం, ఊరందూరు గ్రామానికి చెందిన ఓ నేత కుటుంబంలోని వ్యక్తుల ఫొటోలను పెట్టి తమకు అన్యాయం చేసినట్లు పచ్చిపత్రికల్లో కథనాలు రాయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

కనికట్టు కథలొద్దు!
1/1

కనికట్టు కథలొద్దు!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement