
టీచర్ల సీనియారిటీ జాబితాలో అన్నీ తప్పులే
● అవస్థల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల అయ్యోర్లు ● చిత్తూరు డీఈఓ కార్యాలయానికి పరుగులు ● ప్రభుత్వ పాఠశాలల్లో కుంటుపడుతున్న చదువులు ● కూటమి ప్రభుత్వం పై భగ్గుమంటున్న ఉపాధ్యాయులు
చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లాలో 2,436, తిరుపతి జిల్లాలో 2,444 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. చిత్తూరు జిల్లాలోని పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 1,41,217, తిరుపతి జిల్లాలో 1,87,444 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ కేడర్లలో 24,836 మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా కసరత్తును గత రెండు నెలలుగా నిర్వహించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టీచర్ల సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టిస్) ఆధారంగా సిద్ధం చేశారు. ఈ కసరత్తు పూర్తి చేశాక ఈ నెల 3వ తేదీన కేడర్ల వారీగా జాబితాను విద్యాశాఖ అధికారులు వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. ఆ జాబితాను పరిశీలించుకున్న తర్వాత చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని టీచర్లు తమ వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నట్లు గగ్గోలు పెడుతున్నారు.
అన్నీ తప్పులే
అన్ని మేనేజ్‌మెంట్ల సీనియారిటీ జాబితాల్లో తప్పులే ఉన్నట్టు ఉపాధ్యాయులు వాపోతున్నారు. స్కూల్ అసిస్టెంట్ సీనియార్టీ జాబితాలను డీఎస్సీ, పుట్టిన తేదీల ఆధారంగా పొందుపరచడంతో సీనియర్, జూనియర్ అనే వ్యత్యాసం వచ్చినట్లు గగ్గోలు పెడుతున్నారు. ప్యానల్ సీనియారిటీ జాబితాలను పాటించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడినట్లు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పుల సవరణకు టీచర్లు చిత్తూరు డీఈవో కార్యాలయానికి వచ్చి అభ్యంతరాలు తెలియజేయాలని చెప్పడం బాధాకరమని పలువురు మండిపడుతున్నారు.
తిరుపతి, చిత్తూరు జిల్లాల సమాచారం
చిత్తూరు జిల్లాలోని పాఠశాలలు 2,436
తిరుపతి జిల్లాలోని పాఠశాలలు 2,444
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు 8,435
విధులు నిర్వహిస్తున్న
స్కూల్ అసిస్టెంట్లు 7,534
స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు 901
ఎస్జీటీ పోస్టులు 8,295
విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీలు 6,443
ఎస్జీటీ ఖాళీ పోస్టులు 1,852
పనిచేస్తున్న హెచ్‌ఎంలు 408
తప్పులను తొలగించాలి
విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన సీనియారిటీ జాబితాలో దొర్లిన తప్పులను సవరించాలి. ఈ సీనియారిటీ జాబితాలో 90 శాతం తప్పులున్నాయి. ఇలాంటి జాబితాలు విడుదల చేయడం బాధాకరం. – జీవీరమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
ఎవరికి ఉపయోగం
విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన తప్పుల తడక సీనియారిటీ జాబితా ఎవరికి ఉపయోగమని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి జాబితాల వల్ల సమయం వృథా తప్ప ఒరిగేదేమి ఉండదు. సీనియర్ల స్థానంలో జూనియర్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. – ముత్యాలరెడ్డి,
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తిరుపతి జిల్లా
సీనియారిటీకి తిలోదకాలు
సీనియారిటీకి తిలోదకాలు ఇచ్చి జాబితాలను సిద్ధం చేశారు. రెండుమూడేళ్ల తర్వాత ఉద్యోగోన్నతి పొందిన వారు సీనియర్లు గా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. – రెడ్డిశేఖర్‌రెడ్డి,
వైఎస్సార్‌టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్
ఇది కరెక్ట్ కాదు
టీచర్లను ఇబ్బందులు పెట్టడం కరెక్టు కాదు. అధికారులు కసరత్తులో తప్పులు చేసి టీచర్లను వేధిస్తున్నారు. తప్పిదాలను తొలగించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 66 మండలాల టీచర్లను చిత్తూరుకు వచ్చి నేరుగా అభ్యంతరాలు ఇవ్వాలని చెప్పడం సబబుకాదు. – బాలాజీ, ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు
సమస్యలు ఇలా..
ఉద్యోగోన్నతుల సందర్భంగా రెండు, మూడు రకాల తేదీలను పొందుపరచడంతో సీనియారిటీ జాబితాలో లోపాలు దొర్లాయి.
2002 అక్టోబర్ 31వ తేదీన ఉద్యోగోన్నతి పొందిన వారిలో వివిధ తేదీలను నమోదు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
డీఎస్‌సీ 2000లో సెంకడరీ గ్రేడ్ టీచర్‌గా ఎంపికై , 2001 డీఎస్‌సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికై న వారి సీనియారిటీలో రెగ్యులర్ వారికంటే జాబితాలో ముందున్నారు.
డీఎస్‌సీ 2018లో సోషియల్ (ఎస్‌ఏ) టీచర్లు వివిధ తేదీలలో జాయిన్ కావడంతో వారి సీనియారిటీ జాబితాలో వ్యత్యాసం కనిపిస్తోంది.
2002 ఆన్‌లైన్ టీచర్ల నియామక ప్రకారం ఆ కేడర్‌లో సీనియారిటీ పొందుపరచాలి.
2008 డీఎస్‌సీలో ఎంపికై న ఉపాధ్యాయుల సీనియారిటీ కొన్ని మండలాల్లో ఉత్తర్వుల ప్రకారం అమలు చేయకపోవడంతో అసమగ్రత ఏర్పడింది.

టీచర్ల సీనియారిటీ జాబితాలో అన్నీ తప్పులే

టీచర్ల సీనియారిటీ జాబితాలో అన్నీ తప్పులే

టీచర్ల సీనియారిటీ జాబితాలో అన్నీ తప్పులే

టీచర్ల సీనియారిటీ జాబితాలో అన్నీ తప్పులే
Comments
Please login to add a commentAdd a comment