బీమా రంగ భవిష్యత్‌ను కాపాడండి
● తిరుపతి ఎంపీకి విన్నవించిన ఎల్‌ఐసీ ఏజెంట్లు
తిరుపతి మంగళం: బీమా రంగ భవిష్యత్‌ను కాపాడాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సూచించారు. ఎల్‌ఐసీ ఏజెంట్లు ఈ నెల 19వ తేదీన ఢిల్లీలోని రామలీలా మైదానంలో శాంతియుత ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ ఏజెంట్లు మంగళవారం తిరుపతి ఎంపీ కార్యాలయంలో ఎంపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. శాంతియుత ప్రదర్శనకు మద్దతు తెలపాలని కోరారు. ఎల్‌ఐసీ, ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చిన మార్పులు పాలసీదారులు, బీమా పరిశ్రమ దేశ వ్యాప్తంగా 30 లక్షల లైఫ్ ఇన్సూరెన్‌న్స్ ఏజెంట్ల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారత జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 19న ఢిల్లీలో శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు ఎంపీకి వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గతంలో కూడా ఎల్‌ఐసీ ఏజెంట్ల సమస్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటులో ప్రస్తావించిన విషయాన్ని వారికి గుర్తుచేశారు. ఢిల్లీలో నిర్వహించనున్న శాంతియుత ప్రదర్శనకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment