తిరుపతి లీగల్: నమ్మకద్రోహం కేసులు శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన రీజనల్ అకౌంట్ ఆఫీస్ అసిస్టెంట్ కంట్రోలర్ వీ.రామమోహన్‌కు రెండేళ్ల జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి సత్యకాంత్‌కుమార్ మంగళవారం తీర్పు చెప్పారు. కోర్టు ఏపీపీ జయశేఖర్, కోర్టు కానిస్టేబుల్ శేఖర్ తెలిపిన వివరాలు.. నిందితుడు రామమోహన్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ రాయలసీమ జోన్ రీజనల్ అకౌంట్ ఆఫీస్‌లో అసిస్టెంట్ కంట్రోలర్‌గా పనిచేసేవాడు. సీఎఫ్‌ఎంఎస్ ఉద్యోగులకు చెందిన బిల్లులను బయోమెట్రిక్ ద్వారా యూనివర్సిటీకి అందజేసేవాడు. 2018 నవంబర్ ఆరో తేదీ యూనివర్సిటీకి చెందిన 81 వేల 128 రూపాయలను తన బ్యాంక్ అకౌంట్‌కు అక్రమంగా బదిలీ చేసుకున్నాడు. 2019లో తన కుమార్తెకు తెలి యకుండా ఆమె పేరున అక్రమంగా ఓ తప్పుడు బ్యాంక్ అకౌంట్‌ను తయారుచేసి వివిధ తేదీలలో యూనివర్సిటీకి చెందిన రూ.9,71,620ను బదిలీ చేసుకున్నాడు. 2019 మే రెండో తేదీ యూనివర్సిటీ అకౌంటు సిబ్బంది యూనివర్సిటీకి చెందిన అకౌంట్లను పరిశీలిస్తుండగా మొత్తం 12 లక్షల 20వేల 671 రూపాయలు మాయమైనట్టు గుర్తించారు. దీనిపై వెటర్నరీ యూనివర్సిటీ అప్పటి రిజిస్టర్ డాక్టర్ డీ.శ్రీనివాసరావు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడు రామ మోహన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
Comments
Please login to add a commentAdd a comment