7 నుంచి డీడీఈ అడ్మిషన్లు
తిరుపతి సిటీ: ఈ నెల 7వ తేదీ నుంచి ఎస్వీయూ డీడీఈ పీజీ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ ఊక రమేష్‌బాబు పేర్కొన్నారు. ఎస్వీయూ దూరవిద్య కేంద్రంలో బుధవారం నూతన డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దూర విద్యా కేంద్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి పీజీ అడ్మిషన్లు ప్రారంభించామని నోటిఫికేషన్ గురువారం విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. డీడీఈ ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment