50 రోజులుగా నత్తనడకన రీసర్వే
● తొలి దశలో పైలెట్ ప్రాజెక్టు కింద 33 గ్రామాలు ఎంపిక ● 4 నెలల గడువులో 20 వేల ఎకరాల లక్ష్యం ● ఇప్పటి వరకు అంతంతమాత్రంగానే ప్రక్రియ
●
సర్వే వేగవంతం చేయాలి
కూటమి ప్రభుత్వం మళ్లీ రిసర్వే ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే ఈ సర్వేని పారదర్శకంగా నిర్వహించాలి. వేగవంతంగా చేపట్టాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సర్వే గ్రామాలను మళ్లీ నిర్వహించడం మంచిది కాదు. – జగదీష్, రైతు
మిట్టకండ్రిగ, వరదయ్యపాళ్యం మండలం
ముందుగా 33 గ్రామాల్లోనే..
ఈ ఏడాది జనవరి20వ తేదీ నుంచి రీసర్వే మొద లు పెట్టాం. ముందుగా 33 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద సర్వే చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకే సర్వే చేపడతాం. గతంలో సర్వే చేసిన గ్రామాల్లో తిరిగి సర్వే ఉండదని భావిస్తున్నాం. అప్పట్లో చేయని గ్రామాల్లో మాత్రమే సర్వే ఉంటుంది. గతంలో ఉపయోగించిన డ్రోన్లనే వాడుకుంటాం. అవసరాలకు తగ్గట్టు సర్వేయర్లు ఉన్నారు.
– అరుణ్‌కుమార్, జిల్లా సర్వే విభాగం అధికారి
తిరుపతి అర్బన్ : బ్రిటీష్ పాలన తర్వాత భూముల రీసర్వే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టారు. గత ఏడాది ఫిబ్రవరి చివరి వరకు సర్వే కొనసాగించారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సర్వే ఆగిపోయింది. కూటమి సర్కార్‌లో మళ్లీ సర్వే ప్రారంభించారు. భూవివాదాలు అధికంగా ఉన్న గ్రామాలను ఎంపిక చేస్తే రీసర్వే తొలిదశలో గందగోళ పరిస్థితులు తలెత్తుతాయని అంచనా వేశారు. ఈ మేరకు ఎలాంటి వివాదాలు లేని పల్లెలను మాత్రమే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో భాగంగా జిల్లాలోని 33 మండలాల్లోని 33 గ్రామాల పరిధిలో 20వేల ఎకరాల్లో రీసర్వేకు ఆదేశాలు జారీచేశారు. ప్రక్రియ పూర్తి చేసేందుకు నాలుగు నెలలు గడువు ఇచ్చారు. ఇప్పటికే సర్వే మొదలుపెట్టి 50 రోజులు గడుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో రైతులకు సర్వే కోసం నోటీసులు మాత్రమే ఇచ్చారు. తర్వాత సర్వే చేయడంతోపాటు సరిహద్దురాళ్లు ఏర్పాటు చేయడం, భూహక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇందుకు 70 రోజులు మాత్రమే గడువు ఉండడం గమనార్హం.
50 రోజులుగా నత్తనడకన రీసర్వే
50 రోజులుగా నత్తనడకన రీసర్వే
50 రోజులుగా నత్తనడకన రీసర్వే
Comments
Please login to add a commentAdd a comment