ఓటేరు..ఆక్రమించేశారు!
తిరుపతి శివార్లలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓటేరు చెరువు మాయమవుతోంది. అధికారుల కళ్లెదుటే చెరువును పూడ్చివేస్తున్నా కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గురువారం సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆధ్వర్యంలో నాయకులు చెరువును పరిశీలించారు. అనంతరం అక్కడే కొంతసేపు నిరసన చేపట్టారు. తన ఇంటి పక్కన చెరువును పూడ్చేస్తుంటే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి తెలియ లేదా? అంటూ నిలదీశారు. ఆక్రమణలు ఆపకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం నాయకులు బాలసుబ్రమణ్యం, టీ.సుబ్రమణ్యం, ఎస్.జయచంద్ర, కే.వేణుగోపాల్, పీ.హేమలత, కే.సుమన్, ఎం.నరేంద్ర, పీ.బుజ్జి, మునిరాజు, శేఖర్ పాల్గొన్నారు. – తిరుపతి రూరల్
Comments
Please login to add a commentAdd a comment