షార్‌లో ఘనంగా సైన్స్ దినోత్సవం
సూళ్లూరుపేట: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రంలోని బ్రహ్మప్రకాష్ హాలులో గురువారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముంబై ఐఐటీ ప్రొఫెసర్ కే సుబ్రమన్యన్ విచ్చేశారు. ముందుగా సర్ సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన షార్ డైరెక్టర్ ఏ.రాజరాజన్ మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన తీరును వివరించారు. అనంతరం ప్రొఫెసర్ కే.రామసుబ్రమన్యన్ మాట్లాడుతూ ‘దిలాస్ట్ ట్రెజర్ ఆప్ ఇండియన్ సైన్స్’ అనే అంశం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా షార్ ఇంజినీర్లుకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సైన్స్ ప్రాజెక్టులకు సంబంధించి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. షార్ కంట్రోలర్ ఎం.శ్రీనివాసులురెడ్డి, షార్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.
షార్‌లో ఘనంగా సైన్స్ దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment