డీవైఈఓ పరీక్షలను వాయిదా వేయండి
తిరుపతి ఎడ్యుకేషన్ : ఉప విద్యాశాఖాధికారి (డీవైఈఓ) పోస్టుల భర్తీకి ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించనున్న ఏపీపీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాలాజీ, జీ.వెంకటసత్యనారాయ డిమాండ్ చేశారు. ఆ మేరకు గురువారం విజయవాడలో ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్ ఏఆర్.అనురాధను కలిసి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో డీవైఈఓ పరీక్షలను వాయిదా వేయాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. క్షేత్ర స్థాయి పరిస్థి తులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని హా మీ ఇచ్చినట్లు వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 8 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 63,285 మంది స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన టిక్కెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment