చట్టాలపై అవగాహన ఉండాలి
తిరుపతి క్రైం : పోలీసు ఉద్యోగంలో విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ప్రొఫెషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్లకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు దిశానిర్దేశించారు. గురువారం పోలీస్ అతిథి గృహంలో 39 మంది ప్రొబిషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. సమాజంలో పోలీస్ పాత్ర చాలా విలువైనదని చెప్పారు. నిరంతరం పోలీసులను ప్రజలు గమనిస్తూనే ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి హేమంత్‌పాల్గొన్నారు.
రేపటి నుంచి
తుడా టవర్స్‌కి వేలం
తిరుపతి తుడా: తిరుపతి నగరంలోని అన్నమయ్య కూడలి వద్ద తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిర్మిస్తున్న తుడా టవర్స్ ప్లాట్లకు శనివారం నుంచి వేలం నిర్వహించనున్నట్టు ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య తెలిపారు. నిర్మాణంలో ఉన్న తుడా టవర్స్‌ని గురువారం ఆమె ఇంజినీరింగ్ అధికారులతో పరిశీలించారు. వేలం నిర్వహణపై తుడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాయలచెరువు రోడ్డులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 3.6 ఎకరాలలో తుడా టవర్స్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 13 అంతస్తులలో తుడా టవర్స్ నిర్మాణం జరుగుతోందని, గ్రౌండ్, ఒకటవ అంతస్తుల్లో 27 దుకాణాలతో వాణిజ్య సముదాయాలు, రెండు, మూడు, నాలుగు అంతస్తుల్లో ఆఫీస్‌ల వినియోగానికి, మిగిలిన అంతస్తుల్లో నివాస యోగ్యంగా 2, 3, 4 బెడ్ రూమ్ ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. నివసించేందుకు 230 ప్లాట్లు ఉంటాయని, అందులో 46 డబుల్ బెడ్ రూమ్స్, 152 ట్రిబుల్ బెడ్ రూమ్స్, 32 నాలుగు బెడ్ రూమ్స్ ఫ్లాట్స్ ఉంటాయని చెప్పారు. శనివారం 2, 3 అంతస్తులకు, 9వ తేదీ 4,5, అంతస్తులకు, 10వ తేదీ 6, 7 అంతస్తులకు, 11న 8,9 అంతస్తులకు, 12న 10, 11 అంతస్తులకు ఉదయం 10 నుంచి 1 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేలం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో కార్యదర్శి వెంకటనారాయణ, సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment