
ఎస్సీవీ నాయుడు విమర్శలు విడ్డూరం
తిరుపతి కల్చరల్: ఓటేరు చెరువు కబ్జాను అడ్డుకున్న వావపక్ష నేతలపై మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అనుచిత వ్యాఖ్యాలు చేయడం విడ్డూరమని వామపక్ష, ప్రజాసంఘా నేతలు ఽతెలిపారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, ఆర్‌పీఐ దక్షిణాది అధ్యక్షుడు పి.అంజయ్య, రైతు సంఘ నేత మాంగాటి గోపాల్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా నేత కందారపు మురళి మాట్లాడారు. ఓటేరు చెరువును కబ్జాను కమ్యూనిస్టు నేతలుగా తాము పరిశీలించి అడ్డుకోవడం జరిగిందన్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకొని చెరువును కాపాడాలని డిమాండ్ చేశామన్నారు. అయితే శ్రీకాళహస్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఆ భూమి తనదని, కమ్యూనిస్టులు తన చుట్టూ తిరిగారని అనుచిత వ్యాఖ్యాలు చేయడం తగదన్నారు. తక్షణం తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment