
రెవెన్యూ పని తీరుపై ఆర్డీఓ అసహనం
చంద్రగిరి: మండలంలో రెవెన్యూ అధికారుల పనితీరుపై ఆర్డీఓ రామ్మోహన్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక సమావేశమయ్యారు. భూ సమస్యలు, రెవెన్యూ దర ఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలో జోరుగా ఇసుక అక్ర మ రవాణా, గ్రావెల్ దందా, ఇసుక డంపులు, ప్రభుత్వ భూముల కబ్జాలపై ఆయనకు ఫిర్యా దులు అందాయి. వాటికి సంబంధించి సిబ్బంది నుంచి వివరాలు కోసం ఆరాతీశారు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన మండిపడ్డారు. ఇంతలో ఓ వీఆర్‌ఓ తహసీల్దార్ అనుమతులు ఇచ్చారంటూ తెలపడంతో, ఆయనకు ఫోన్ చేసి వివరాలను కనుక్కోమని సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ స్పందిస్తూ అనుమతుల గడువు ముగిసినట్లు తెలపడంతో ‘మీరు ఏ మాత్రం పనిచేస్తున్నారో తెలుస్తోంది’ అంటూ ఆగ్రహించారు. నాగయ్యగారిపల్లిలో ఇసుకను తరలిస్తే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. తాను ప్రతి వారం ఆకస్మిక తనిఖీ చేస్తానని, అధికారుల పనితీరులో అలసత్వం కనిపిస్తే ఉపేక్షించేంది లేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment