
మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, టాస్క్ పోర్సు: గూడూరు సబ్‌కలెక్టరేట్ ఆవరణలో ఓ మహిళ తనకు న్యాయం చేయాలని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిపాలైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కొడవలూరు మండలం, రావూరు గ్రామానికి చెందిన ఆమె చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామంలో బంధువుల వద్ద మూడు ఎకరాల భూమిని పదేళ్ల క్రితం కొనుగోలు చేసింది. ఈ భూమిని తన పేరు మీద రికార్డుల్లో మార్చాలని రెవెన్యూ అధికారులకు విన్నవించింది. ఆ భూమి చుక్కల భూమిగా నమోదైందని చెప్పడంతో ఆమె మరొకరికి లీజుకు ఇచ్చింది. ఈ క్రమంలో ఇటీవల ప్రభుత్వం చుక్కల భూములను తొలగించడంతో ఆమె కొనుగోలు చేసిన భూమిని కూడా విడుదల చేశారు. ఆ సమయంలో రెవెన్యూ అధికారులు ఆ భూమిని మరొకరికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఆమె తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోవడంతో సబ్ కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెను చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment