రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంటలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను అర్బన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట పోలీసుల కథనం మేరకు.. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో శుక్రవారం అర్బన్ సీఐ శరత్ చంద్ర, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ బాలుర హైస్కూల్ పక్కన హిందూ శ్మశాన వాటిక వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గంజాయి విక్రయిస్తున్న వినాయక్ నగర్‌కు చెందిన కాజేరిరాజు(21), పాంచాలి నగర్‌కు చెందిన కాజేరి రాము(20), రాము మదన్ (21), అడపాల సాయిప్రసాద్ (27), ఏఎన్‌ఆర్ కాలనీకి చెందిన గురవయ్య(20)ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై వారి వద్ద నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. వారిపై పలు కేసులు నమోదు చేసి తిరుపతి కోర్టులో హాజరు పరచగా.. జడ్జి రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment