
● టాటా ఏసీ వాహనం ఢీకొని ఇద్దరు వలస కూలీల మృతి ● మరో ముగ
దూసుకొచ్చిన మృత్యువు
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్)/ పెళ్లకూరు: పొట్ట కూటి కోసం వలస వచ్చిన కూలీల పైకి టాటా ఏసీ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం.. రేణిగుంట మండలం, గాజులమండ్యం పోలీస్ స్టేషన్ సమీపంలోని నాయుడుపేట– పూతలపట్టు జాతీయ రహదారి, యోగానంద కాలేజీ నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జి పై కూలీలు రమణమ్మ, తిరుపాల్, సరోజమ్మ, సక్కమ్మ, శైలజ పనిచేస్తున్నారు. అదే సమయంలో ఓ టాటా ఏసీ వాహనం వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రమణమ్మ(41), తిరుపాల్(50) మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాజులమండ్యం ఎస్‌ఐ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
–12 మంది గాయాలు
పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి కొత్తూరు గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు.. రోడ్డు అభివృద్ధి పనుల చేసే కూలీలను తరలించే ట్రాక్టర్ కొత్తూరు గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆపి ఉంచారు. తిరుపతి నుంచి కర్నూలు, శ్రీశైలం వెళ్లే గూడూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, ఎస్‌ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నాయుడుపేటకు తరలించారు. వీరిలో తీవ్ర గాయాలైన పెమ్మసాని పద్మ, సుబ్బరాజు, నాగరత్నమ్మను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
పంబలేరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం
గూడూరు రూరల్: గూడూరు రూరల్ పరిధిలోని పురిటిపాళెం సమీపంలో ఉన్న పంబలేరు కాలువలో గుర్తు తెలియన వ్యక్తి మృత దేహాన్ని గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ మనోజ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి 30–35 సంవత్సరాలు ఉంటాయన్నారు. నల్ల ప్యాంటు, తెలుపు, పసుపు రంగలు షర్టు వేసుకున్నట్టు వెల్లడించారు. రెండు రోజుల క్రితం మృతిచెంది ఉండొచ్చని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

● టాటా ఏసీ వాహనం ఢీకొని ఇద్దరు వలస కూలీల మృతి ● మరో ముగ

● టాటా ఏసీ వాహనం ఢీకొని ఇద్దరు వలస కూలీల మృతి ● మరో ముగ

● టాటా ఏసీ వాహనం ఢీకొని ఇద్దరు వలస కూలీల మృతి ● మరో ముగ
Comments
Please login to add a commentAdd a comment