
జాతీయ స్థాయిలో ఎస్వీయూ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ: ఉత్తరప్రదేశ్ నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ వేదికగా ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ విశ్వవిద్యాలయాల సాంస్కృతిక పోటీలలో ఎస్వీయూ విద్యార్థులు ప్రతిభ చూపారు. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ఓవరాల్ ఛాంపియన్స్‌గా రెండో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. వర్సిటీ కల్చరల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, ఆచార్య మురళీధర్ నాయకత్వంలోని వర్సిటీ విద్యార్థుల బృందంలోని ప్రతిభ చూపిన వారిలో మోడలింగ్ విభాగంలో కె.తేజ ప్రథమ స్థానం, ఇన్‌స్టలేషన్‌లో ఆర్.మౌనిక, డి.దేవా రెండో స్థానం, మెహందీలో ఎస్ సంధ్య, దీప్తి రెండో స్థానం, రంగోలిలో వీరాంజనేయులు రెండో స్థానం, పోస్టర్ మేకింగ్‌లో దేవా మూడో స్థానం సాధించారు. వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, అధ్యాపకులు ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.
సత్తాచాటిన మహిళా వర్సిటీ విద్యార్థినులు
నోయిడా యువజనోత్సవాలలో పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థినులు ఫైనార్ట్స్ విభాగంలో మూడో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. కల్చరల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ శైలేశ్వరి ఆధ్వర్యంలో పోటీలలో పాల్గొన్న విద్యార్థుల బృందం పలు విభాగాలలో సత్తా చాటింది. ప్రధానంగా మైమ్స్ విభాగంలో ప్రత్యూష, మౌనిక, భాను, చంద్రజ్యోతి, మీనాభాను, శివాని, కీర్తి సత్తా చాటగా, స్కిట్ విభాగంలో నీలిమ, సత్య భార్గవి, సువర్ణేశ్వరి, సాత్విక, నిహారిక విజేతలుగా నిలిచారు. విద్యార్థినులను వీసీ ఉమ, రిజిస్ట్రార్ రజిని, అధ్యాపకులు అభినందించారు.

జాతీయ స్థాయిలో ఎస్వీయూ విద్యార్థుల ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment