అత్త దారుణ హత్య
తిరుపతి క్రైం : నగదు కోసం అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వెస్ట్ సీఐ మురళీమోహన్, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎర్రావారిపాళెం మండలం, బండమీద కమ్మపల్లికి చెందిన ప్రమీలమ్మ(60) తన భర్త గోపాల్‌రెడ్డితో కలిసి గత 30 ఏళ్లుగా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉండేది. ఈ మధ్య కాలంలో ప్రమీలమ్మ చింతకాయల వీధిలో పాచి పనులు చేసుకుంటూ అదే ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆమె భర్త మేస్త్రి పనిచేసుకుంటూ పీపీ చావడిలో నివాసముండేవాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శుక్రవారం ఉదయం డెంటల్ హాస్పిటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె చిన్న కూతురు రోజా వద్దకు వెళ్లింది. కుమార్తె డ్యూటీలో ఉండడంతో కోలా వీధిలోని చిన్న గుంటలో ఉన్న ఇంటి తాళాలను వారి అమ్మకి ఇచ్చి పంపించింది. దీంతో ఇంటికి వెళ్లిన ప్రమీల అక్కడ ఏమైందో ఏమో గానీ రోజా వచ్చి చూసే సరికి నోట్లో రక్తం వచ్చి కింద పడిపోయి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఇదిలా ఉంటే చుట్టుపక్కల స్థానికులు మాత్రం రోజా రెండవ భర్త రవినాయక్(డ్రైవర్ గా పనిచేస్తున్నాడు) అత్త ప్రమీలతో నగదు కోసం గొడవపడి.. ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. గొంతు నిలిమి చంపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె వద్ద ఉన్న నగదు కోసమే హత్య చేసి ఉంటాడని చెబుతున్నారు.
మందుబాబుల వీరంగం
తడ: మధ్యం కోసం కలిసి వచ్చి, మత్తు ఎక్కాక ఓ మిత్రుడు మరో మిత్రుని తలపై బీరు బాటిల్‌తో దాడి చేసి గాయపరిచిన ఘటన తడలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. వరదయ్యపాళెం మండలం, పులివెల్లం గ్రామానికి చెందిన ముని సమీప గ్రామానికి చెందిన వినోద్‌తో కలిసి తడలో శ్రీకాళహస్తి మార్గంలో ఉన్న మద్యం దుకాణానికి వచ్చారు. అక్కడ మద్యం సేవించి మత్తులో ఉన్న వినోద్ సమీపంలో ఉన్న ఖాళీ బీరు బాటిల్‌తో ముని తలపై కొట్టాడు. భయపడ్డ వినోద్ అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై పోలీసులకు ఎలాంటి ిఫిర్యాదు అందలేదు.
అత్త దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment