భారీగా ఎర్రచందనం స్వాధీనం
● ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్
తిరుపతి మంగళం : కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో రూ.35 లక్షల విలువ చేసే 34 ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ హెడ్ ఎల్.సుబ్బారాయుడు, టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ జీ.బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌ఐ చిరంజీవులుకు చెందిన ఆర్‌ఎస్‌ఐ పీ.నరేష్ టీమ్ శుక్రవారం బద్వేలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టింది. సి.రామాపురం సమీపంలో ఎద్దులబోడు వద్ద రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వీరు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. దాంతో సిబ్బంది వెంబడించి వారిని పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా 34 ఎరచ్రందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి నుంచి మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలతో సహా స్మగ్లర్లను తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీటి విలువ రూ.35 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రఫీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment