No Headline
ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా ఐతేపల్లి
చంద్రగిరి: మండలంలోని ఐతేపల్లి సర్పంచ్ ఫాజిలా కృషికి విశిష్ట గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ ప్రాజెక్టు కింద ఐతేపల్లి పంచాయతీ ఎంపికై ంది. ఇప్పటికే పంచాయతీలో సుమారు రూ.కోటి వరకు వెచ్చించి రోడ్డు నిర్మాణం, ఆర్వో ప్లాంటు, రూ.7 లక్షలతో క్రీడా మైదానం సుందరీకరణ, పులిత్తివారిపల్లి జగనన్న కాలనీ, మామండూరు జగనన్న కాలనీ, ఎర్రగుట్టపల్లిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టారు. పులిత్తివారిపల్లి శ్మశానానికి బీటీ రోడ్డును నిర్మించారు. ఐతేపల్లి జగనన్న కాలనీలో జల్‌జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ కొళాయి కనెక్షన్, గత ప్రభుత్వంలో తుడా నిధుల కింద సమావేశ మందిరాలు, సచివాలయ నిర్మాణాలు, కాలువల నిర్మాణాలు చేపట్టారు.
– ఫాజిలా, ఐతేపల్లి సర్పంచ్
వనిత... జాతీయ ఘనత
రేణిగుంట : శ్రీకాళహస్తి మండలం, జగ్గరాజుపల్లికి చెందిన ముసలిపాటి బుజ్జమ్మ స్థానికంగా అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఆమె 18 ఏళ్ల కృషికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో కీర్తిని తెచ్చిపెట్టింది. చిట్టి మెదళ్లలో గట్టి పునాది వేసింది. ఆమె సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. జాతీయ స్థాయి ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్తగా అవార్డుకు ఎంపిక చేసింది. శనివారం దేశరాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. ఆమెకు ఆమె భర్త వీరరాఘవులు, కుమార్తె పూజిత, కుమారుడు రాఘవేంద్రకుమార్ ఉన్నారు. పూర్వపాఠశాల స్థాయి చిన్నారులతో మమేకమవుతూ వారిలో చదువుల జ్ఞానానికి సంబంధించి బలమైన పునాధి వేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోషణ్ వాటిక’ పథకం ద్వారా పాఠశాల ఆవరణలో ఆకుకూరలు, కూరగాయలు సేంద్రియ ఎరువులతో ఆరోగ్యకరమైన సమతుల పోషకాహారాన్ని అందిస్తోంది. నెలలో రెండుసార్లు విధిగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి పిల్లల అభ్యసన పురోగతికి ప్రేరణ కలిగిస్తోంది. పాఠశాలలో 25 మంది పిల్లలు చదువుతున్నారు. జాతీయ స్థాయి ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్తగా అవార్డుకు బుజ్జమ్మ ఎంపికవడం తమకెంతో గర్వకారణమని శ్రీకాళహస్తి సీడీపీవో శాంతిదుర్గ, సూపర్‌వైజర్ మంజు తెలిపారు.
No Headline
No Headline
No Headline
Comments
Please login to add a commentAdd a comment