
వైఎస్సార్‌సీపీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకు
తిరుపతి మంగళం : ప్రతి పేదవాడికి మెండుగా సంక్షేమ పథకాలను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు జగనన్న అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంటెక్ బాబు అన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద శనివారం సత్యవేడు నియోజకవర్గ సమన్వకర్త నూకతోట రాజేష్ ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ మద్దిల గురుమూర్తి, మేయర్ శిరీష సమక్షంలో ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎంటెక్ బాబుకు కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సత్యవేడులో రాజేష్ అన్న గెలుపుకోసం కృషి చేస్తానన్నారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు బీరేంద్రవర్మ, పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, సత్యవేడు నియోజకవర్గ మండల నాయకులు దయాకరరెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, గురునాథం, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment